బంగారు తెలంగాణ నిర్మిద్దాం

Thu,December 12, 2019 01:49 AM

ఊట్కూర్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మక్తల్‌ మండలం పంచదేవ్‌పహాడ్‌ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులను జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పంచాయతీకో కార్యదర్శిని నియమించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో పార్టీలకతీతంగా ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, ఎంపీపీ వనజదత్తు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చిట్యాల నిజాంపాషా, సర్పంచ్‌ కల్పన, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నేతాజీరెడ్డితోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles