బాధ్యతగా పని చేయండి

Thu,December 5, 2019 01:49 AM

:జెడ్పీచైర్‌పర్సన్‌
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ప్రమోషన్‌ పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు సీనియర్‌ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఉద్యోగులు ప్రతి క్షణం ఆరాట పడాలని, అప్పుడే వారికి తగిన గుర్తింపు వస్తుందన్నారు. మనం ఉద్యోగంలో లేకపోయినా మనం చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడు ఉండాలని సూచించారు.

9
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles