మామిడికి ఫసల్‌ బీమా యోజన పథకం వర్తింపు

Thu,December 5, 2019 01:47 AM

-నారాయణపేట జిల్లాకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు
-ఈనెల 31 నాటికి ప్రీమియం చెల్లింపునకు గడువు

నారాయణపేట, నమస్తే తెలంగాణ : పునర్వవస్తీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 2016 వానకాలం నుంచి అమలు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిం చనప్పుడు, వాతావరణ మార్పుల వల్ల పంటకు నష్టం కలిగే తరుణంలో రైతులకు ఆర్థికంగా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద మామిడి పంటకు రైతులు కేవలం 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లాలోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సాధారణ బీమాతో పాటు మామిడి పంటకు అదనపు సౌకర్యాన్ని సైతం కల్పించింది. వడగళ్ల వాన వల్ల జరిగే నష్టానికి అదనపు ప్రీమియం చెల్లించి బీమా పొందే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ బీమా ప్రీమియాన్ని ఈనెల 30వ తేదీలోపు చెల్లించాలని గడువు నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయబడిన వాతావరణ అంశానికి, సీజన్‌లో నమోదైన వాతావరణ అంశానికి వ్యత్యాసం ఉంటే నష్టపరిహారం చెల్లించబడుతుంది. సర్కారు ఆదేశాల మేరకు అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ బీమా చెల్లింపు బాధ్యతలు తీసుకున్నది.

ఈ పథకంలో చేరేందుకు అర్హత
మామిడి పంటలు సాగు చేసే అన్ని వర్గాల రైతులకు, బ్యాంకులో రుణం తీసుకొనే రైతులు, రుణం తీసుకోని రైతులు, కౌలుదారులకు కూడా ఈ పథకం ద్వారా బీమా సౌకర్యం వర్తిస్తుంది.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles