రెండేళ్లలో రైతులకు సాగు నీటిని అందిస్తా..

Thu,December 5, 2019 01:46 AM

-మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
-ఊట్కూర్‌లో మైనార్టీ కమ్యూనిటీ భవనం ప్రారంభం

ఊట్కూర్‌ : మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పంచ్‌మసీదు ఖాళీ స్థలంలో ఎమ్మెల్యే నిధులు రూ. 5 లక్షలు వెచ్చించి నూతనంగా నిర్మించిన మైనార్టీ కమ్యూనిటీ భవన సముదాయాన్ని గురువారం ఎమ్మెల్యే చిట్టెం రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం పంచ్‌ మసీద్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ల్యాఖత్‌అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. గడిచిన ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణాన్ని తీర్చుకునేందు కు శక్తి వంచన లేకుండ కృషి చేస్తానని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థుల సౌకర్యార్థం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మీడియట్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

రెండేళ్లలో సాగు నీరందిస్తాం..
అత్యంత విస్తీర్ణం కలిగి ఉన్న ఊట్కూరు పెద్ద చెరువుకు సాగు నీటిని అందించేందుకు ప్రణాళికలను తయారు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఊట్కూరు పెద్ద చెరువుకు సంబంధిత ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించి గ్రామస్తుల చిరకాల కోరికను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మార్చితే రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుపోగా పనుల ప్రారంభానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పంచ్‌ మసీదు కమిటీ నాయకులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ ఎల్లాగౌడ్‌, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్హ్రిమాన్‌, ఉప సర్పంచ్‌ ఇబాదుల్‌ రహిమాన్‌, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ బాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, విజయసింహారెడ్డి, గోవిందప్ప, శివరామరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, జమీర్‌, గంగాధర్‌చారి, తరుణ్‌, బసిరెడ్డి, వివిధ గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మీపల్లి బస్సప్ప, శ్రీనివాసులు, కృష్ణంరాజు పాల్గొన్నారు.

మక్తల్‌ జాతరకు
ఏర్పాట్లను పూర్తి చేయాలి
ఊట్కూర్‌(మక్తల్‌ ) : అత్యంత వైభవోపేతంగా జరిగే మక్తల్‌ పడమటి ఆంజనేయస్వామి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు జరిగే పడమటి ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా 12న జరిగే రథోత్సవం వేడుకలను తిలకించేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ట్రాఫిక్‌, విద్యుత్తు, పారిశుధ్యం, తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. భక్తులకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసేందుకు సంబందిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎం అండ్‌హెచ్‌వో సౌభాగ్యలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ పావని, ఎస్సై అశోక్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

13
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles