ఆడబిడ్డల పెండ్లికి సర్కారు భరోసా

Tue,December 3, 2019 12:35 AM

-కొండంత అండనిస్తున్న కల్యాణలక్ష్మి
-అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు..
-మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
-మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
-మాగనూరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మాగనూర్‌ : ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు బాధపడే రోజులు పోయాయని, ఆడబిడ్డ జన్మిస్తే అదృష్టలక్ష్మి పుట్టిందనే భరోసా తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్ధానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్ధిక సహాయం అందించిన దాఖాలాలు లేవన్నారు. పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఇంటిపెద్దగా మారి, వారి పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారని అన్నారు. దీంతో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్‌ను దేవుడిగా పూజిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం మరిన్ని సంక్షే మ కార్యక్రమాలను అమలు చేస్తామని, అన్ని వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు. అనంతరం మండలంలోని 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామలమ్మ, వైస్‌ఎంపీపీ తిప్పయ్య, అయా గ్రామాల సర్పంచులు రాజు, నర్సింలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తాసిల్దార్‌ రమేశ్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి ఆర్‌ఐలు నర్సింలు, చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles