అండగా.. ఆత్మీయుడు

Tue,December 3, 2019 12:33 AM

నారాయణపేట టౌన్‌ : ఆత్మీయుడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రెసిడెన్సియల్‌ పాఠశాలలు, వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, వారు తప్పకుంగా తనిఖీలు చేయాలని, వారంలో ఒక రోజు వనతి గృహాలలో నిద్రించాలని కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం పల్లెప్రగతి కార్యక్రమంతో పాటు ప్రతి శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లాలోని అధికారులు, ప్రత్యేక అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆత్మీయుడు కార్యక్రమంలో భాగంగా అధికారులు తమకు కేటాయించిన వసతి గృహాలలో పిల్లలతో మాట్లాడి వారి స మస్యలను తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి గురించి మున్సిపల్‌ అధికారులతో వివరాలను అడి గి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిలో భా గంగా నోడల్‌ అధికారులు ప్రతి శుక్రవార ం పట్టణాలలో గంటపాటు కార్యక్రమాలు నిర్వహించాలని, మున్సిపాలిటీలలో మురుగు కాలువల వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో రవికుమార్‌, జెడ్పీ సీఈవో కాళిందిని, ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles