వైభవంగా ‘జీర్ణోద్ధరణ’

Tue,December 3, 2019 12:31 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని పరిమళపురంలో వెలసిన అనంతశయన దేవాలయం జీర్ణోద్ధరాణ కార్యక్రమంలో భాగంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తూ వస్తున్న బృహత్‌ సహస్త్రయాగం సోమవారం నాటితో ఘనంగా ముగిసింది. నూతనంగా నిర్మించిన ఆలయ గోపురంపై కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయం మార్మోగిపోయింది. ఆదివారం ప్రారంభమైన బృహత్‌ సహస్త్ర యాగాన్ని రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, వేదపండితులు, బ్రాహ్మాణులు, భక్తులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles