ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి : జెడ్పీ సీఈవో

Tue,December 3, 2019 12:31 AM

నర్వ : జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈవో కాళిందిన పేర్కొ న్నారు. సోమవారం మండలంలోని లంకాల గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రజలు ఉపాధి హామీ పథకంలో గల పండ్లతోటల పెంపకం, పాంపండ్స్‌, కాల్వల తవ్వకాల తోపాటు పంట పొలాలకు వెళ్లే రోడ్లను అభివృది చేసుకోవాలని సూచించారు. అలాగే హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ప్రతి ఇంటి దగ్గర నిమ్మ, మునగ చెట్లు పెంచి ఆడపిల్లలు రక్తహీనత బారిన పడకుండా తల్లులు శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతను సైతం నిర్మించుకోవాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఉమా రాయిరెడ్డి, కార్యదర్శులు రాజబాబు, కరుణాకర్‌, ఎఫ్‌ఏ, టీఏ, వీబీకేలతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles