ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఈవో

Tue,December 3, 2019 12:31 AM

ఊట్కూర్‌ : విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈవో రవీందర్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నిడుగుర్తి ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించి పలు ప్రశ్నలు వేయగా సమాధానాలు వెంటవెంటనే చెప్పడంతో డీఈవో వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పాఠశాల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. పాఠశాలలో అమలవుతున్న స్వచ్ఛత కార్యక్రమాల పట్ల డీఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంచి జరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్యంగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు బోధించేందుకు అవకాంశం ఉంటుందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించి వెంటనే పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎస్‌ఎంసీ సభ్యులతో కలిసి విద్యార్థులకు ఆరోగ్య కిట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ యశోదమ్మ, ఎంపీటీసీ రాఘవరెడ్డి, హెచ్‌ఎం లక్ష్మారెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నర్సింలు, సునీత, వెంకటప్ప, సుజాత, ఆంజనేయులు, శ్రీనివాస్‌ సలాం, లియాఖత్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles