ఎయిడ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Mon,December 2, 2019 12:16 AM

-జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి
-ఎన్‌హెచ్‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
-ఎయిడ్స్‌ నివారణ దినోత్సవంలో కలెక్టర్‌ వెంకట్రావు
-పరీక్షా కేంద్రాలలో కౌన్సెలింగ్‌ : డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి

నారాయణపేట టౌన్‌ : జిల్లాను ఎయిడ్స్‌ రహిత జిల్లా గా తీర్చి దిద్దాలని కలెక్టర్‌ వెంకట్రావు సూచించారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్స వం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్డీ వో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డీవో కార్యాలయం నుండి వీరసావర్కర్‌ చౌరస్తా సత్యనారాయణ చౌరస్తా మీదుగా బస్టాండ్‌ వరకు చేరుకున్న ర్యాలీ తిరిగి ఆర్డీవో కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల వద్ద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు.

డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి ఎలా వస్తుంది, తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు తదితర అంశాలను వివరించారు. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులకు వాడిన సూదులు, సిరంజిలు, బ్లేడ్లు ఇతరులకు ఉపయోగించడం ద్వారా, హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తుల రక్తా న్ని పరిక్షించకుండా ఇతరులకు రక్త మార్పిడి చేయడం వల్ల, హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నా రు. సమగ్ర కౌన్సెలింగ్‌ పరీక్షా కేంద్రాలలో హెచ్‌ఐవీ పరీక్షల ముందు పరీక్ష తర్వాత సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం వైద్యాధికారు లు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్‌ శైలజ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ హన్మంతు, వైద్యాధికారులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles