నేడు ట్రాక్టర్ల పంపిణీ

Mon,December 2, 2019 12:14 AM

కొత్తకోట: గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో బాగంగా కొత్తకోట మండలం గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను సోమవారం పంపిణీ చేయ్యనున్నట్లు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో ఉదయం 10.00 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, మండల నాయకులు, రైతు సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles