కొనసాగుతున్న పక్షం రోజుల ప్రణాళిక

Mon,December 2, 2019 12:13 AM

కొత్తకోట: కొత్తకోట మున్సిపల్‌ కేంద్రంలో పక్షం రోజుల ప్రణాళిక ఆదివారం కొనసాగుతుంది. అందులో పట్టణంలోని 9, 11 వార్డులలో జరుగుతున్న పారిశుధ్య, విద్యుత్‌, మిషన్‌ భగీరథ పనులు, కంపచెట్ల తొలగింపు పనులను ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్‌ కమిషనర్‌ కతలప్ప, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ప్లాస్టిక్‌, చెత్త చెదారం వంటి వ్యర్థాలను మున్సిపల్‌ ట్రాక్టర్‌లో వేసి స్వచ్ఛ కొత్తకోటకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. అదేవిధంగా వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులలోని సమస్యలు మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ మల్లేశ్‌, మాజీ ఎంపీటీసీ సంజీవులు, మాజీ వార్డు సభ్యులు సుభాశ్‌, హనమంతుయాదవ్‌, వినోద్‌సాగర్‌, రాజశేఖర్‌, సహదేవ్‌, మహేశ్‌, రాజ్‌కుమార్‌, చింటు, గణేశ్‌, మున్సిపల్‌ అధికారులు కృపయ్య, నాగభూషణ్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles