లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

Mon,December 2, 2019 12:13 AM

కోస్గి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2లక్షల చెక్కును నాచారం గ్రామానికి చెందిన మె తుకు రవికి అందజేశారు. ఆదేవిధంగా మద్దూర్‌ మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన రైతు అబ్దుల్‌ ఖలీల్‌ కు టుంబానికి రైతు బీమా పథకం ద్వారా రూ.5లక్షల చె క్కును పంపిణీ చేశారు. రైతుబంధుపథకంలో భాగం గా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షల చెక్కును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజ ల అవసరాలను గుర్తించి ప్రవేశ పెట్టిన పథకాలను విజయవంతంగా ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, మండల వైస్‌ఎంపీపీ సాయిలు. మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు హన్మంత్‌రె డ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్‌, నాయకులు గోవర్థన్‌యాదవ్‌, దౌల్తాబాద్‌ మండల జెడ్పీటీసీ మైపాల్‌, ఓంప్రకాశ్‌ పాల్గొన్నారు.

వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే..
నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు గందెమోహన్‌ వివాహానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం మద్దూర్‌ మండలంలోని కొత్తపల్లి టీఆర్‌ఎస్‌ కార్యకర్త వివాహానికి హాజరై అక్కడి నుంచి తిమ్మారెడ్డిపల్లిలో ఆలయ ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles