వరికి మద్దతు ధర ఇస్తున్నాం

Sun,December 1, 2019 02:00 AM

-కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
-దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
-గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.135 ధర చెల్లింపు
-విక్రయించే రైతు ఖాతా, ఆధార్ అంది
-కొనుగోలు కేంద్రం తనిఖీలో కలెక్టర్ వెంకట్రావు
మరికల్ : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఎస్ వెంకవూటావు అన్నారు. శనివారం మండలంలోని తీలేరు సింగిల్ విండో కార్యాలయంలో ఏర్పాటు చేసి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో ఏ రకం వరి ధాన్యానికి రూ.135లు, బీ గ్రేడ్ దాన్యాన్నికి రూ.115ల మద్దతు ధరను ఇస్తున్నదని, దళారులను నమ్మవద్దని రైతులు తమ ధాన్యాన్ని ఈ కేంద్రాలలలో సద్వియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


అయితే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు బ్యాంక్ పాసుబుక్, ఆధార్‌కార్డులను వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ నారాయణ రావు, ఆర్‌ఐ భుపాల్‌డ్డి, కాళాప్ప, విఆర్‌వో గోవర్ధన్‌చారీ, సింగల్‌విండో సీఈవో మాధవరావు సిబ్బంది రాములు తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles