వివాహిత పట్ల పోకిరీల అనుచిత ప్రవర్తన

Sun,December 1, 2019 01:54 AM

గద్వాల క్రైం : శంషాబాద్‌లో దారుణ హత్యకు గురైన యువతి సంఘటన కళ్లముందు ఇంకా కదులుతూనే ఉంది.. అయినా కొందరు పోకిరీల్లో ఇంకా ఇసుమంతైనా మార్పు రావ దేశ వ్యాప్తంగా శంషాబాద్ హత్యోదంతం కలిచి వేస్తుంటే కండకావరం ఎక్కిన పోకిరీలు ఏమాత్రం భయం లేకుండా శనివారం ఓ వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అదృష్టవశాత్తు ఆ వివాహిత ఓ పోకిరి చేతిని గట్టిగా కొరికి వేయడంతో వారి చెర నుంచి బయటపడింది. లేదంటే పరిస్థితి మరో శంషాబాద్ ఘటనను తలపించేది. తనకు ఎదురైన పరిస్థితిని కుటుంబ సభ్యులకు.. స్థానికులకు చెప్పడంతో ఆ పోకిరీలను లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. పరిస్థితి చేజారేలా ఉండడంతో వెంటనే పోలీసులకు అప్పగించారు.

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గద్వాలలోని సుంకులమ్మమెట్టు వీధిలో ఉంటున్న ఎరకలి శివ (17) ఇక్కడి ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శివ సమీప బంధువు ఎరుకలి సురేశ్ (22) భవన నిర్మాణ దినసరి కూలీగా పని చేస్తున్నాడు. పోకిరీ చేష్టలకు అలవాటు పడ్డ శివ, సురేశ్‌లు పక్కా ప్లాన్‌తో శనివారం సుంకులమ్మమెట్టుకే చెందిన ఓ వివాహిత (25) గద్వాల శివారులోని చెనుగోనిపల్లి రహదారిలో ఓ ముళ్లకంప వద్ద కాగితాల సేకరణలో నిమగ్నమై ఉండగా ఆమెతో మాటలు కలిపి ముందుకెళ్తే ప్లాస్టిక్ డబ్బాలు చాలా ఉంటాయి కదా అక్కడికెళ్లు అని సలహా ఇచ్చారు. ఆ పోకిరీల మాటలు నమ్మిన ఆమె వారు చెప్పినట్టుగా ప్లాస్టిక్ డబ్బాల సేకరణ కోసం ఇంకాస్త ముందుకెళ్లింది.

ఇదే అదనుగా భావించిన శివ, సురేశ్‌లు వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను ఇబ్బంది పెట్టే క్రమంలో ఆమె నోరు మూశారు. రెప్పపాటులో తేరుకున్న ఆ మహిళ శివ చేతిని నోటితో గట్టిగా కొరికి వేయడంతో పాటు సురేశ్‌ను ప్రతిఘటించి అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకుంది. తనకు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఇంటి పక్క నున్న వారికి చెప్పడంతో కోపోవూదిక్తులైన వారు ఎరుకలి శివ, ఎరుకలి సురేశ్‌ల కోసం గాలించి లాకొచ్చారు. సుంకులమ్మమెట్టు వద్ద అందరూ చూస్తుండగానే దేహశుద్ధి చేశారు. పరిస్థితి చేజారేలా అక్కడి వాతావరణం కనిపించడంతో స్థానికులు వెంటనే గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులను అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎరుకలి శివ, ఎరుకలి సురేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గద్వాల టౌన్ ఎస్సై సత్యనారాయణ చెప్పారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles