రోడ్లపై కల్లాలు.. ప్రాణాలతో చెలగాటాలు

Wed,November 13, 2019 02:44 AM

నారాయణపేట ప్రతినిధి నమస్తే తెలంగాణ: రోడ్లపై ఏర్పాటు చేసే.. కల్లాలు పలు కుటుంబాలలో విషాదాలను మిగిలిస్తున్నాయి. ప్రతి ఏటా పంట చేతికి వచ్చిన వెంటనే రైతులు తాము పండించిన ధాన్యాన్ని కంకులనుంచి వేరే చేయడానికి, ధాన్యాన్ని ఎండబెట్టడానికి రోడ్లనే కల్లాలుగా వాడుతున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాలలో రోడ్లపైన కంకులను వేసి వాటిపై నుంచి వాహనాలు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవడంమరి కొన్ని చోట్ల ధాన్యాన్ని ఆరబోసి ఆ ధాన్యం మీదుగా వాహనాలు వెళ్లకుండా ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం వంటి కారణాలతో ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంఘటనలలో కొంత మంది ప్రాణాలను కోల్పోయి, మరికొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఎన్నో మార్లు జరిగినప్పటికిని రైతులకు సరియైన అవగాహన కల్పించక పోవడం వల్ల ప్రతి ఏటా ప్రమాదాలు జరుగూతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికరాఉలు రైతులకు నచ్చ జెప్పి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని పలువురు బాధిత కుటంబాలు పేర్కొంటున్నాయి.

ప్రమాదాలు ఇలా జరుగుతున్నాయి
రోడ్లపై కల్లాలు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కంకుల నుండి ధాన్యాన్ని వేరే జేసే క్రమంలో ఆ కంకుల మీద వెళ్ళే వాహనాలు అదుపుతప్పి కిద పడటం లేదా మరో వాహనాప్పి ఢీ కొట్టడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ధాన్నాన్ని రోడ్లపైననే రాత్రి వేళల్లో కుప్పలుగా ఉంచడం వల్ల విషయం తెలియని వాహన చోదకులు ఆ కుప్పల పైకి వాహనాన్ని వేగంగా తీకుకువెళ్ళడంతో అదుపుతప్పి వాహనాలు ప్రమాదాలకు గురి అవుఉతన్నాయి. రైతులు ధాన్యం చుట్టూ ఉంచాన రాళ్లు తీసివేయక పోవడంతోను వాహనచోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. సగభాగం రోడ్లను కల్లాలు ఆక్రమమించడంతో వాహనదారులు మార్గాన్ని సరిగ్గా అంచనా వేయక, ప్రమాదాలకు గురైన సంఘటలను ఎన్నో ఉన్నాయి.

ఇలా అధిగమించవచ్చు
కల్లాల వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలను అధికారులు గుర్తించి ప్రత్యేక చర్యలను చేపట్టాల్సి ఉంది. రైతులు తమ కల్లాలను రోడ్లపై ఏర్పాటు చేసుకోకుండా వారి పొలాలు, లేదా ఇళ్లవద్ద కల్లాలను శ్రమకు ఓర్చి ఏర్పాటు చేసుకునేవిధంగా ప్రోత్సహించాలి. రోడ్లపై కల్లాల వల్ల జరిగే ప్రమాదాలను గురించి రైతులకు అవగాహన కల్పించాలి. ప్రమాదాల వల్ల ఇతర కుటుంబాల జీవితాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయో వివరించి చెప్పాలి. అవసరమైతే గ్రామాల్లో చాటింపు వేయాలి.

కొన్ని సంఘటనలు
జిల్లాలోని ప్రతి మండంలోనూ కల్లాల ఏర్పాటు వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటలను ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని..
- 2016 సెప్టెంబర్‌ 21వ తేదీన ఊట్కూర్‌ మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన దొడ్ల బాలరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, మేస్త్రీగా పని చేస్తున్న బాలరాజు కూలీల కోసం వెళ్తుండగా మగ్దంపూర్‌-బిజ్వారం గ్రామాల మధ్యం ఆముదాలను ఆరబోయడంతో తన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
- నర్వ మండంలోని జాండ్రగుట్ట వద్ద ఏర్పాటు చేసిన కల్లాలవద్ద రెండుసార్లు జరిగిన వేర్వేరు సంఘటనలలో అదే గ్రామానికి చెందిన నరేశ్‌, కిష్టన్న తీవ్రగాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే మండలానికి చెందిన గంధం ఆంజనేయులు ప్రమాదానికి గురియయ్యారు. కుర్వబాలప్ప అనే వ్యవక్తి తీవ్ర గాయాలపలయ్యారు.
- ఐదేండ్ల క్రితం దామరగిద్ద మండంలోని బాపన్‌పల్లి ప్రధాన రహదారిపై పెసర కల్లాల అనంతరం పేసర పొట్టును రైతులు వదిలి వేయడంతో దానిపై పడిన వర్షం పడటంతో జిగుటగా మారి దానిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువుకట్ట నుంచి కిందికి పడబోగా చిన్నపాటి రాయి బస్సుకు అండగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది.
- క్రిష్ణ, మాగనూర్‌, మక్తల్‌, మరికల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లోనూ కల్లాల వల్ల పలు ప్రమాదాల జరిగినట్లు సమాచారం.

అవగాహన కల్పిస్తాం
రోడ్లపై కల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కలిగే అనర్థాలను గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. సంబంధిత శాఖాల అధికారుల సహకారంతో రోడ్లపై కల్లాల ఏర్పాటును పూర్తి స్థాయిలో నిషేధించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు సమస్యలను గుర్తించి సహకరించాలి
- డాక్టర్‌ చేతన, ఎస్పీ

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles