నాటక రంగాన్ని కళాకారులే బతికించుకోవాలి

Mon,November 11, 2019 02:23 AM

-నాటక, సంగీత అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్
భూత్పూర్ : నాటక రంగాన్ని కళాకారులే బతికించుకోవాలని రాష్ట్ర నాటక, సంగీత అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో దివంగత బ్రహ్మానందాచారి స్మారకార్థం ఏర్పాటు చేసిన నాటక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకాలు మన సంస్కృతీ సాంప్రదాయాలను పెంపొందిస్తాయన్నారు. పౌరాణికాల ద్వారా మన పురాణాలు, భక్తి విశ్వాసాలు నేటి తరం సమాజానికి తెలుస్తాయని చెప్పారు. నాటక రంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ రోజుల్లో నాటకాలకు ఆదరణ తగ్గిందని, సంగీతానికి ఆదరణ పెరిగిందన్నారు. నృత్యాన్ని మరీ డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నాటక రంగం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

గ్రామాలలో ఉన్న కళాకారులకు మంచి శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్రహ్మానందాచారి మంచి హర్మోనిస్ట్ అని, ఈ రోజుల్లో హర్మోనిస్టులు లేకపోవడం వల్ల నాటకాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. అంతకుముందు బ్రహ్మానందాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాద్మి శివకుమార్‌ను కళాకారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ, అయ్యన్న, మండల నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, హర్యానాయక్, కొండయ్య, నిత్యనందాచారి తదితరులు పాల్గొన్నారు.

15
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles