సాఫీగా ఆర్టీసీ ప్రయాణం

Mon,November 11, 2019 02:22 AM

నారాయణపేట ప్రతినిధి నమస్తే తెలంగాణ : జిల్లాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజల ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఆదివారం సెలవు రోజు కావ డం, మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఉండడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 55 ఆర్టీసీ, 33 హైర్ బస్సులు జిల్లాలో తిరిగాయి. జిల్లా లోని ఆయా బస్టాండ్లలో, ప్రధాన గ్రామాల స్టేజీల వద్ద రద్దీ ఎక్కువ కన్పించింది. పరిస్థితులను ముందుగా అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచి వివిధ మార్గాలలో ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో తిరిగిన బస్సుల ద్వారా దాదాపుగా పదివేల మందికి పైగా ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ, ఇతర బస్సులు జిల్లాలో తిరగడంతో ప్రజ లు ప్రయాణం చేశారు.

11
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles