ఘనంగా మహ్మద్ ప్రవక్త జన్మదినం

Mon,November 11, 2019 02:22 AM

నారాయణపేట టౌన్ : మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగను జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నా రు. ముస్లిం సోదరులు మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థన చేసి ఒకరి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ర్యాలీలో పాల్గొన్న ముస్లింలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ చేతన ముస్లిం సోదరులకు పండ్లరసం పంపిణీ చేసి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్ వర్ధన్, సత్యయాదవ్, సీఐ సంపత్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.

8
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles