సజావుగా ప్రయాణాలు

Sun,November 10, 2019 01:20 AM

-జిల్లాలో నడిచిన 43 ఆర్టీసీ, 34 హైర్ బస్సులు
-6 వేల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు..
-అసౌకర్యం కలగకుండా బస్సులు తిప్పుతున్న అధికారులు

నారాయణపేటప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో శనివారం ఆర్టీసీ బస్సులు ఏ ఆటంకాలు లేకుండా తిరగడంతో ప్రజల ప్రయాణాలు సజావుగా సాగాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా మిలియన్ మార్చ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు తరలడంతో ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సుల ప్రయాణాలకు ఆటంకాలు కలగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ చేతన ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు అవసరమైన బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో భద్రత ఏర్పాట్లు చేశారు. దీనితో ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా మార్గాల్లో సురక్షితంగా తిరిగాయి. నారాయణపేట డిపో పరిధిలో ఉన్న 79 ఆర్టీసీ బస్సులకు గాను 43 బస్సులు, 34 అద్దె బస్సులకు గాను అన్ని బస్సులు వివిధ రూట్లలో తిరిగాయి. ప్రయాణికుల సంఖ్యను అంచనా వేస్తూ నారాయణపేట డిపో మేనేజర్ సూర్యప్రకాష్‌రావు ఎప్పటికప్పుడు బస్సులను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణపేట, మక్తల్, కోస్గి తదితర ముఖ్య ప్రాంతాల నుంచి ప్రయాణికులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, రాయచూర్ వంటి ముఖ్య ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో వారి సంఖ్య కు అనుగుణంగా అధికారులు తాత్కాలిక సిబ్బంది సహకారంతో బస్సులను నడిపారు. దాదాపుగా 6 వేల మంది ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరుకోగలిగారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles