సాధనతోనే క్రీడాకారులుగా ఎదుగుతారు

Sun,November 10, 2019 01:18 AM

నారాయణపేట రూరల్ : సాధనతోనే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని, ప్రతి క్రీడాకారుడు శారీరక ధృడత్వంతో పాటు క్రమశిక్షణను కలిగి ఉండాలని జెడ్పీ సీఈవో, డీవైఎస్‌వో కాళిందిని పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక స్డేడియం గ్రౌండ్‌లో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ అండర్14, అండర్ 17విభాగంలో ఎంపికలు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు శారీరక ఎదుగుదలకు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, దీంతో ధృడం గా తయారై క్రీడలలో బాగా రాణించి విజయాన్ని అందుకుంటారన్నారు. అనంతరం పేట జిల్లా ఏఎంవో రాజేంద్రకుమార్‌తో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌జీ సెక్రటరీ రాంకళ్యాణ్ జీ, అసిస్టెంట్ సెక్రటరీ సాయినాథ్, పేట టీఎస్ జిల్లా అధ్యక్షులు రమేష్, పీఈటీలు కతలప్ప, ఆంజనేయులు, పీడీ నర్సిములు, అక్తర్ పాషా, రమేష్, నవీన్, శివరాజ్, అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అండర్-14 క్రికెట్ పోటీలకు మనోజ్‌నాయక్, శివశంకర్, రాకేశ్‌రెడ్డి, హబీబ్, పవన్‌కుమార్, నవీన్‌గౌడ్, హర్ష వర్ధన్, సోహెల్, రాజశేఖర్, ప్రసాద్, వాహిద్, నవీన్‌లు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి అండర్-17 క్రికెట్ పోటీలకు అశీష్‌కుమార్, మధు, అమీర్ పాషా, సోహెబ్, మల్లేశ్‌సాగర్, సమీర్, నరేశ్, భాస్కర్, రత్నాకర్‌రెడ్డి, స్వామి మణికంఠ, ఆంజనేయులు, సద్దాం, నరేశ్, రాము, శ్రీను పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles