ఫుట్‌బాల్ క్రీడలో రాణించాలి

Sat,November 9, 2019 05:09 AM

పెబ్బేరు : ఫుట్‌బాల్ క్రీడల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాయోధుడైన డీగో మారడోనా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని పీజేపీ గ్రౌండ్‌లో కేఎల్‌ఆర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-19 బాలుర ఎస్టీఎఫ్ ఫుట్‌బాల్ క్రీడలను జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ దీనస్థితిలో ఉన్న డీగో మారడోనా పట్టుదలతో ఫుట్‌బాల్ ఆటల్లో రాణించి ప్రపంచప్రఖ్యాతి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదిగారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఐదెకరాల క్రీడామైదానం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని తెలిపారు. క్రీడలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదిగి ప్రతి క్రీడాకారుడు క్రీడాయోధుడవ్వాలని ఆకాంక్షించారు. పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి 10 క్రీడా జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గుణ, మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్, సింగిల్‌విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, కృష్ణకుమార్ రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు హరిశంకర్ నాయుడు, రాములు యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విశ్వరూపం, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ముస్తాక్, టీఆర్‌ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు రాంచంద్రారెడ్డి, భారతి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మొదటి రోజు పాల్గొన్న జట్ల వివరాలు..
పెబ్బేరు రూరల్ : రాష్ట్ర స్థాయి అండర్-19 బాలుర ఫుట్‌బాల్ పోటీల్లో శుక్రవారం విజయం సాధించిన జట్ల వివరాలు..
-మెదక్ జట్టుపై నల్లగొండ జట్టు 5-0 తో విజయం
-వరంగల్ జట్టుపై ఖమ్మం జట్టు 3-0 తో విజయం
-కరీంనగర్‌పై రంగారెడ్డి జట్టు 3-0 తో విజయం
-మెదక్‌పై మహబూబ్‌నగర్ జట్టు 7-0తో విజయం
-ఆదిలాబాద్-నిజామాబాద్ జట్లు 1-1తో డ్రా
-ఖమ్మంపై హైదరాబాద్ జట్టు 4-0 తో విజయం
-కరీంనగర్‌పై మహబూబ్‌నగర్ జట్టు 5-0తో విజయం

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles