సివిల్ సర్వీసెస్ టోర్నీకి పీఈటీ ఎంపిక

Fri,November 8, 2019 03:56 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ టోర్నమెంట్‌కు నారాయణపేట జిల్లాకు చెందిన కున్షి జెడ్పీహెచ్‌ఎస్ పీఈటీ మీనాకుమారి ఎంపికైంది. ఈ సందర్భంగా మీనా కుమారిని డీఈవో రవీందర్ పూలమాలలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ కబడ్డీ జట్టుకు ఎంపిక కావడం మన జిల్లా ఎంతో గర్వకారణమన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో జరిగే టోర్నమెంట్‌లో ఈమె పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాములుతోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles