కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Fri,November 8, 2019 03:55 AM

నారాయణపేట టౌన్ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నారాయణపేట డిపో కార్మికులు చేపడుతున్న సమ్మె గురువారం 34వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా డిపో ముందు ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి వామపక్ష, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, సీపీఎం న్యూ డెమోక్రసీ నాయకులు కాశీనాథ్‌లు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. 34 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈనెల 9వ తేదీన హైదరాబాద్‌లో జరిగే సకల జనుల సమరభేరిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles