కురుమూర్తి దర్శనం కోసం బారులు

Fri,November 8, 2019 03:55 AM

చిన్నచింతకుంట : అమ్మాపూర్ సమీపంలోని కాంచనగుహలో కొలువుదీరిన వేంకటేశ్వరుడి ప్రతిరూపం కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు గురువారం భక్తులు బారులు తీరారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు కుటుంబ సమ్మేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి గోవింద నామస్మరణ చేశారు. అనంతరం ద్వార పాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, స్వామి వారి ఉద్దా లు, చెన్నకేశ వస్వామి ఆలయం, శ్రీదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లతోపాటు, కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అలాగే, కొండ దిగు వ భా గంలో స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం జాతర మైదానంలో తినుబండారాలు, ఆట బొమ్మలు, గాజులు తదితరవాటిని కొనుగోలు చేసి సంతోషంగా గడిపారు. స్వామి వా రి దర్శనానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇ బ్బందులకు గురికాకుండా ఈవో శ్రీనివాసులు, ఆలయ సిబ్బంది శివనాందాచారి, సాయిరెడ్డిలు చర్యలు తీసుకున్నారు.

భక్తులకు అన్నప్రసాదం వితరణ
కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతి రోజూ 5వేల మంది చొప్పున అన్నప్రసాదం అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈనెల 14 వరకు అన్నప్రసాద వితరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్ మాజీ అధ్యక్షుడు చింతల నర్సింహయ్యశెట్టి, చిన్నచింతకుంట కృష్ణయ్యశెట్టి పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ.17,05,509
బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి స్వామి ఆ లయానికి రూ.17,05,509 హుండీ ఆదాయం వచ్చిం ది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశం మేరకు గురువారం అసిస్టెంట్ కమిషనర్ వెంకటయ్యచారి, ఈవో శ్రీనివాసులు, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కవిత సమక్షం లో హుండీ డబ్బులను లెక్కించారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.20,94, 640 ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.17,05,509 ఆదాయం వచ్చిందని వారు తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ రాము, నాయకులు ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఈవోలు శ్రీనివాసరాజు, ప్రేమ్‌కుమార్, మురళీదర్‌రెడ్డి పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles