పట్టణాన్ని సుందరీకరించాలి

Thu,November 7, 2019 01:03 AM

నారాయణపేట టౌన్ : పేట పట్టణాన్ని సుందరీకరించాలని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేకాధికారులు, పట్టణ ప్రజలకు సూచించారు. పేట పట్టణంలో 20 రోజుల పట్టణ ప్రత్యేక ప్రణాళిక పనులు కొనసాగుతుండగా బుధవారం కలెక్టర్ వెంకట్రావు ఈ పనులను పరిశీలించారు. పట్టణంలోని 5, 8 వార్డులలో పర్యటించి మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఈ సందర్భం గా కలెక్టర్ ఆయా వార్డు ప్రజలతో మా ట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్లు తప్పక నిర్మించుకొని బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను పరిసరాలలో పార వేయకుండా మున్సిపాలిటీ వారు ఇచ్చిన డబ్బాలలో తడి, పొడి చెత్తను వేరు వేరుగా నిల్వ చేసి మున్సిపల్ ఆటోలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరు వేరు గా వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని కోరారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ చెన్నకేశవులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles