వైద్య సేవలను సక్రమంగా అందించాలి

Thu,November 7, 2019 01:03 AM

-పులిమామిడి పీహెచ్‌సీ తనిఖీలో డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి
ఊట్కూర్ : దవాఖానకు వచ్చే రోగులను ఆదరించి వైద్య సేవలను సక్రమంగా అందజేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని పులిమామిడి ప్రాథమిక వైద్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీడీ ప్రోగ్రాం రికార్డులను పరిశీలించారు. అనంతరం దవాఖానలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టోర్‌రూంలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. దవాఖాన ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొ క్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాన్పులను సంబంధిత దవాఖానల్లోనే జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యుడు నరేశ్‌చంద్ర, సూపర్‌వైజర్‌లు సురేశ్, సరస్వతి, ఫార్మాసిస్టు రవి, స్టాఫ్‌నర్సు ప్రియాంక పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles