కొనసాగిన రెవెన్యూ ఉద్యోగుల నిరసనలు

Thu,November 7, 2019 01:03 AM

-నిందితుడిని శిక్షించాలని కలెక్టర్‌కు వినతి
నారాయణపేట టౌన్ : తాసిల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తూ బుధవారం రెవెన్యూ ఉద్యోగులు, అటవీ శాఖ అధికారులు జిల్లా కేంద్రలోని కలెక్టర్ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రెవెన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డిని హత్య చేయడం హేయమైన చర్య అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కలెక్టర్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు, డీఆర్‌వో రవికుమార్, ఏవో బాలాజీ సఫారేతోపాటు రెవెన్యూ ఉద్యోగులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

విధులకు హాజరవ్వండి..
అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డిని హత్య చేయడాన్ని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు బుధవారం కూడా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు అందరూ తమ తమ విధులలో హాజరు కావాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించడం వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నా రు. కావున విధులకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌వో రవికుమార్, ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles