హెచ్‌సీఏ టూడేస్‌ లీగ్‌లో మరో ట్రిఫుల్‌ సెంచరీ చేసిన గణేశ్‌

Wed,November 6, 2019 02:56 AM

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : హైదరాబాద్‌లో జరుగుతున్న హెచ్‌సీఏ లీగ్‌ మ్యాచ్‌లో జిల్లా జట్టు క్రీడాకారుడు గణేశ్‌ ట్రిఫుల్‌ సెంచరీతో రాణించాడు. మంగళవారం హైదరాబాదులో మహబూబ్‌నగర్‌ డబ్ల్యూఎంసీసీ జట్ల మధ్య జరిగిన టూడేస్‌ లీగ్‌ మ్యాచ్‌లో భాగం గా మొదటి రోజు బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. జట్టులో గణేశ్‌ 192 బంతుల్లో 40 ఫోర్లు, 17 సిక్స్‌లతో 329 పరుగులు చేసి తన కేరీర్‌లో రెండో ట్రిఫుల్‌ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. జట్టులో హర్షవర్ధన్‌ 49, ఖయ్యూం 18, కేశవులు 78, హబి ద్‌ హుస్సేన్‌ 69 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 110 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. జిల్లా జట్టు క్రీడాకారుడు గణేశ్‌ మరో మారు ట్రిఫుల్‌ సెంచరీ సాధించడం పట్ల జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ప్రతినిధులు సురేశ్‌కుమార్‌, వెంకట్‌రామారావు, ఉమేష్‌యాదవ్‌, కోచ్‌ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పిండి పవన్‌కుమార్‌ అన్నారు. సౌత్‌జోన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే పీయూ ఫుట్‌బాల్‌ జట్ల ఎంపికలను మంగళవారం బాలుర కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ ఎంపికలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువ లేదని, ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి ఎంతో మంది క్రీ డాకారులు తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. సౌత్‌జోన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ లో ప్రతిభ చాటి జట్టు విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీ డాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం 25 మం దితో ప్రాబబుల్స్‌ జట్టును ఎంపిక చేశా రు. వారం రోజుల పాటు వారికి శిక్షణ ఇచ్చి తుది జట్టును ఎంపిక చేయనున్నా రు. ఈ కార్యక్రమంలో ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, పీడీ డేవిడ్‌, పీయూ పీడీ బాలరాజ్‌, వెంకట్‌రెడ్డి, సత్యభాస్కర్‌రెడ్డి, మధు, రాజేశ్వర్‌, రామ్మోహన్‌, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు నందకిశోర్‌, నాగేశ్‌, భానుకిరణ్‌, శంకర్‌, నికే ష్‌, విజయ్‌, అధ్యాపకులు రాఘవేందర్‌రెడ్డి, సుజాత్‌ అలీ, హరిబాబు తదితరు లు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో.. పర్యవేక్షణ పటిష్టంనారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ మరింత పెరగనుంది. జి ల్లా విభజన అనంతరం పెరిగిన విద్యా వ్యవస్థ పర్యవేక్షణను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. ప్రతి రోజు కార్యాలయ పనులు, అధికారులతో సమీక్షలు, రాష్ట్ర స్థాయి అధికారులకు ఉత్తర ప్రత్యుత్తరాలతో జిల్లా విద్యాశాఖాధికారులు బిజీబిజీగా ఉంటుండడంతో వారికి సహకారంగా ఉండేందుకు వీ లుగా సెక్టోరియల్‌ పోస్టులను ఇంచుమించు ఆ స్థాయి తర్వాత ఉండేలా భర్తీ చేసేందుకు రాష్ట్ర పాఠశా ల అధికారులు నోటిపికేషన్‌ ఇప్పటికే జారీ చేశారు. ఒకవైపు నూతన ఉపాధ్యాయ నియామకాలను చేపడుతూ నే మరో వైపు సెక్టోరియల్‌ అధికారుల నియామకాలు చేపడుతుండడంతో విద్యను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు మార్గాలు సుగమమం కానున్నాయి.

అనుభవజ్ఞులకే అవకాశాలు
సెక్టోరియల్‌ పోస్టులను అనుభవజ్ఞులు, ప్రతిభావంతులకే అవకాశాలు కలుగనున్నాయి. కనీసం ఐదు సంవత్సరాల పాటు విద్యాబోధన చేసిన జీహెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, 63 సంవత్సరాలలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులకు ఈ అవకాశాలు దక్కనున్నాయి. ఈ పోస్ట్‌లలో ఒక మహిళకు తప్పనిసరి అవకాశం కల్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశాలను కల్పించారు. ఈ నెల చివరి వారంలో పరీక్షలు నిర్వహించి, డిసెంబర్‌ మొదటి వారంలో ఫలితాలను విడుదల చేస్తారు. రెండో వారంలో ఎంపికైన వారు బాధ్యతలను స్వీకరిస్తారు. వీరు మూడు సంవత్సరాల పాటు తమ బాధ్యతలను నిర్వహిస్తారు.

సెక్టోరియల్‌ అధికారుల బాధ్యతలు
సెక్టోరియల్‌ అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి తర్వాత ఆ స్థాయిలో బాధ్యతలను నిర్వహిస్తారు. విద్యా వ్యవస్థ పై నివేదికల తయారీ, బడ్జెట్‌ రూపకల్పన నిధుల కేటాయింపులు, ఉద్యోగ ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు తదితరాలకు సంబంధించిన ప్రతి పాదనలు తయారు చేస్తారు. అలాగే ఆన్‌లైన్‌ అంశాల పరిశీలన, పాఠశాల పర్యవేక్షణ, బాలికా విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలును రూ పొందించి అమలు చేయడం లాంటి పనులు నిర్వహిస్తారు. అలాగే కలెక్టర్‌, డీఈవోలకు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం రాష్ట్ర అధికారులతో ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించడం, జిల్లాలో ఉన్న పాఠశాలల పరిస్థితులు, విద్యార్థుల ప్రతిభ తదితర వివరాలను సేకరించడం వంటి విధులను నిర్వహిస్తారు.

పాఠశాలలు, విద్యార్థుల వివరాలు
జిల్లా వ్యాప్తంగా 330 ప్రాథమిక పాఠశాలలు, 48యూపీఎస్‌, 84ఉన్నత పాఠశాలలు(కేజీబీవీలతో కలిపి) ఉన్నాయి. వీటిలో 16,501మంది విద్యార్థులు ఉన్నారు. ఇటీవలే ఉపాధ్యాయ ఖాళీలు దాదాపుగా భర్తీ కావడం, ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన నియామకాలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాలలో కలిపి 972మంది ఉపాధ్యాయులు విధులను నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయుల కొరతతో అస్థవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థ ఇక నుంచి పూర్తి స్థాయిలో గాడిలో పడనున్నంది.

పర్యవేక్షణ పెరుగుతుంది
సెక్టోరియల్‌ అధికారుల నియామకాలతో పనులు సజావుగా సాగుతాయి. ఉన్న కొద్దిమందితో సిబ్బందితో పనులు నిర్వహించడం పాఠశాలలను పర్యవేక్షించడం ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు నాకు తోడు గా సెక్టోరియల్‌ అధికారులు రానుండడంతోపాటు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా పోయింది. దీంతో ఇక పర్యవేక్షణ మరింత పెంచి ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరిచి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
- రవీందర్‌,డీఈవో నారాయణపేట.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles