కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

Tue,November 5, 2019 12:53 AM

కేటీదొడ్డి (ధరూర్) : కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధరూర్ మండల పరిధిలోని గుడ్డెందొడ్డిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్డెందొడ్డి గ్రామానికి చెందిన కుర్వ సత్యమ్మ (30) అదే గ్రామానికి రాజుకు ఇచ్చి ఆరేండ్ల క్రితం వివాహం చేశారు. గతంలో వీరికి ఇద్దరు పిల్లలు పుట్టి చని పోయారు. ఇప్పుడు ఒక పాప ఉంది. అయితే సత్యమ్మను నీకు ఆడ పిల్లలే పుడతారు అని భర్త రోజూ వేధించేవాడన్నారు. భర్త పెట్టే హింస తట్టుకోలేక అదే గ్రామంలో ఉన్న తల్లి ఇంటికి నెల క్రితం వెళ్లి అక్కడే ఉంటోందన్నారు.

అయినా సత్యమ్మ భర్త రాజు అత్త ఇంటికి వెళ్లి భార్యను వేధిస్తుండేవాడని తెలిపారు. ఈ సందర్భంలోనే సత్యమ్మ జీవితంపై విసుగు చెందిందన్నారు. సోమవారం ఉదయం తల్లితో కలిసి భోజనం చేసిందన్నారు. తల్లి బయటకు వెళ్లగానే ఇంట్లో ఉన్న కత్తిపీటతో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహూటిన గద్వాల దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గోడుపాడు గ్రామ శివారులో ప్రాణాలు విడిచిందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించారు. ఈ సంఘటనతో గుడ్డెందొడ్డిలో విషాదచాయలు అలుముకున్నాయి.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles