విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Tue,November 5, 2019 12:52 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : ఢిల్లీలోని థీస్ హజారే కోర్టులో న్యాయవాదులపై పోలీసులు జ రిపిన లాఠీచార్జ్, బు ల్లెట్ల దాడికి నిరసనగా నారాయణపేట కోర్టు లో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారని, ఢిల్లీ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు తమ విధులను బహిష్కరించి నిరసన తెలపడం జరిగిందని నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశాయ్ వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోటకొండ సీతారామరావులు అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు చెన్నారెడ్డి, నారాయ ణ, దామోదర్‌గౌడ్, అబ్దుల్ సలీం, ఆకుల బాలప్ప, రఘువీర్‌యాదవ్, నందునామాజీ, లక్ష్మిపతిగౌడ్, నర్సింలు, కుర్మన్నగౌడ్, వెంకట్‌రాజ్, నాగేశ్వరి, ప్రవీణ్‌కుమార్‌నామాజీ, భైరంకొండ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles