సమ్మతి పత్రమిస్తే సరి

Mon,November 4, 2019 01:59 AM

-సీఎం కేసీఆర్ హామీతో విధుల్లో చేరేందుకు సిద్ధం
-ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకే రావాలి
-సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో సమ్మతి పత్రం
-హెడ్‌ఆఫీస్ అనుమతితో విధుల్లోకి..

మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నెల రోజులు గడుస్తున్నా ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు. శనివారం సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్ సమ్మెలో ఉన్న కార్మికులను ఆలోచింపజేసింది. అం దుకే వెంటనే కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు కా ర్మికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమ్మతిపత్రం ఇచ్చి విధుల్లో చేరారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ చెప్పిన ప్రకారం విధుల్లో చేరితే కనీసం సంస్థ ఉనికి ఉంటుందని, తమ ఉద్యోగాలు నిలుస్తాయనే ఉద్దేశం కార్మికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులకు ఫోన్ చేసి విధుల్లో చేరే అంశంపై మాట్లాడుతున్నారు. ఆదివారం కావడంతో ఉమ్మడి జిల్లాలో విధుల్లో చేరే అంశంపై కార్మికుల్లో కాస్త గందరగోళం కనిపించింది. ఇప్పటికే విధుల్లో చేరేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. మరోవైపు విధుల్లో చేరే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ, పోలీసు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపోల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చే కార్మికులను అడ్డుకున్న వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

విధుల్లో చేరాలంటే..
ఇన్నాళ్లు సమ్మెలో ఉన్న కార్మికులు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. అయితే విధుల్లో ఎలా చేరాలో తెలియక కొంతమంది గందరగోళానికి గురవుతున్నారు. ఈ నే పథ్యంలో విధుల్లో చేరేందుకు ఏం చేయాలో మహబూబ్‌నగర్ డీవీఎం నారాయణ తెలిపారు. ఉద్యోగి తన నెంబర్, డిపో పేరు, చేరుతున్న తేదీ వివరిస్తూ... ముఖ్యమంత్రి పిలుపు మేరకు సమ్మె విరమించుకుని బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు సమ్మతిపత్రం (సెల్ఫ్ డిక్లరేషన్) రాసి ఇవ్వాల్సి ఉంది. దీని కి సంబంధించిన ప్రొఫార్మ అధికారులు విడుదల చేశారు.

నిరక్షరాస్యులైతే..
మెకానిక్ తదితర పోస్టుల్లో ఉన్న నిరక్షరాస్యులు ఎవరైనా విధుల్లో చేరాల్సిన పరిస్థితుల్లో వారు సమ్మతి పత్రం రాసేందుకు ఇబ్బంది అవుతుంది. అలాంటి పక్షంలో వెంట ఎవరినైనా తీసుకునిపోయి సమ్మతి ప త్రం రాసివ్వాలి. లేదంటే అక్కడే ఉండే సెక్యూరిటీ సి బ్బంది సాయపడతారు. విధుల్లో చేరేందుకు వచ్చే వారికి అధికారుల నుంచి అన్ని విధాలా సాయం అందుతుంది.

సమ్మతి పత్రం ఇచ్చిన తర్వాత..
విధుల్లో చేరతామని సమ్మతిపత్రం ఇచ్చిన తర్వాత వాటన్నింటిని మెయిల్ ద్వారా హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసుకు పంపిస్తారు. హెడ్ ఆఫీసు నుంచి అనుమతి వచ్చిన వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు డిక్లరేషన్ ఇచ్చిన ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకుంటారు.

విధుల్లో చేరతామని వస్తున్న సిబ్బంది..
నెల రోజుల పాటు సమ్మె చేసినా సాధించిందేమీ లేదని గుర్తించిన కార్మికులు సీఎం పిలుపు మేరకు వి ధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డిపో మేనేజర్లకు ఫోన్ చేసి తమ సమ్మతి తెలియచేస్తున్నా రు. ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డుపై పడే కంటే విధు ల్లో చేరి సంస్థలో ఉండి సీఎం చెప్పిన ప్రకారం సానుకూలంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకునే ప్రయత్నం చేయడమే మే లనే ఆలోచన కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు కార్మికులు విధుల్లో చేరారు. అక్కడక్కడ యూనియన్ నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నందున అనవసరంగా సమ యం వృథా చేయడం సరైన పద్ధతి కాదని పలువురు కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles