నేడు ఉద్యోగ మేళా

Mon,October 21, 2019 01:45 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిమిత్తం సోమవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో పీడీ క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీ4ఎస్ సెక్యూర్ సొల్యూషన్స్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)లో ఖాళీగా ఉన్న 500 సెక్యూరిటీ గార్డుల భర్తీ కోసం ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశామన్నారు. 10వ తరగతి, ఆపై చదివిన నిరుద్యోగుల వయస్సు 18 నుంచి 35 ఏండ్లలోపు ఉండాలని తెలిపారు. ఎంపికైన వారు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు తమ నిజ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9000167417 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles