జోనల్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ

Fri,October 18, 2019 02:15 AM

లింగాల : స్థానిక సంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు జోనల్ క్రీడల్లో ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ నాగభూషణం, పీడీ వెంకటేశ్వర్, వైస్‌ప్రిన్సిపాల్ బాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లా పరిగిలో 6జోనల్ స్థాయి అండర్ -19, అండర్ -17,అండర్ -14 క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రీడల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల విద్యార్థులు పాల్గొనగా లింగాల గురుకుల పాఠశాలకు చెందిన అండర్ -19 విద్యార్థులు 400మీటర్ పరుగు పందెంలో శివశంకర్, దినకర్, వసంత్, పృథ్వీ ద్వితీయ స్థానంలో అండర్ -17, 19లో బాల్‌బ్యాడ్మంటన్ విభాగంలో ద్వితీయ స్థానంలో, అండర్ -19 లాంగ్‌జంప్‌లో దినకర్ రెండో స్థానంలో, చదరంగంలో శివ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles