గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి

Thu,October 17, 2019 02:28 AM

నారాయణపేట రూరల్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం గ్రామాల్లో పా రిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్రావు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సూ చించారు. బుధవారం కలెక్టర్ వెంకట్రావు మండలంలోని అంత్వార్ గ్రామాన్ని పరిశీంచారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజుల పాటు నిర్వహించిన ప్రణాళిక పనులతో గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, ఇందుకు గ్రామస్తులు కూడా సహకరించాలని కోరారు. అనంతరం గ్రా మంలోని అంగన్‌వాడీ కేంద్రా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిశోర బాలికలకు, బాలింతలకు, చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీలకు సూచించారు. గ్రామంలోని పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరని, వెంటనే రెగ్యులర్ ఉపాధ్యాయుడ్ని నియమించాలని కలెక్టర్‌కు గ్రామస్తులు విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ రెగ్యులర్ ఉపాధ్యాయుడ్ని నియమించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను, అంగన్‌వాడీ కేంద్రంలోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles