గురుకులాలు, వసతిగృహాలకు భవనాలు నిర్మించండి

Tue,October 15, 2019 02:20 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని మైనార్టీ గురుకులాలు, వసతి గృ హాల భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షాన్ నవాజ్ కాశీం తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లా మైనార్టీ శాఖ అధికారులతో ఆయన మా ట్లాడారు. ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమంలో భా గంగా భవన నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్ర భుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. ఆయా భవన నిర్మాణాలకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాల, వసతిగృహాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వాలు రూ.23కోట్లను ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే, సీఎం ఓవర్సిస్ పథకం ద్వారా మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి నివేదికలను తమకు పంపించాలని తెలిపా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల దరి చే ర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అ నంతరం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతి మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతిగృహాల నిర్మాణాలకు సంబంధించి కావాల్సిన స్థలాలను రెవెన్యూ అధికారులు అప్పగించారని, త్వరలోనే పనులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం ఓవర్సిస్ పథకానికి ఆరుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, నలుగురు విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles