సజావుగా ప్రయాణాలు

Sun,October 13, 2019 02:13 AM

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులు సమ్మే చేపట్టి ఎనిమిది రోజులు గడిచినా.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం జిల్లాలో 48 డిపార్ట్‌మెంట్‌ బస్సులు, 28 హైర్‌ బస్సులతోపాటు 120 దాకా ప్రైవేటు జీపులు, ఇతర వాహనాలు నడిచాయి. 18 వేలకుపైగా ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. రద్దీ మేరకు బస్సులను నడుపుతుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను తీవ్రతరం చేస్తున్నా ప్రజల ప్రయాణాలకు ఏ మాత్రం ఇబ్బందులు కలుగడం లేదు. జిల్లాలో సమ్మె ప్రారంభమైన రోజు నుంచి శనివారం వరకు అధికారులు ప్రజల ప్రయాణాలకు ఆటంకాలు కలుగకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లచే నడిపిస్తున్నారు. మరో వైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్‌ వాహనాల ను అనుమతించడంతో ప్రయాణాలకు మాత్రం ఆటంకాలు కలుగడం లేదు. శనివారం జిల్లా వ్యాప్తంగా 79 ఆర్టీసీ బస్సులకు గాను 48 బస్సులు ప్రయాణికులను చేరవేయగా 34 హైర్‌ బస్సులకు గాను 28బస్సులు ప్రయాణికుల సేవలలో ఉన్నాయి. మరో 125కు పైగా కార్లు, జీపులు, 150కిపైగా ఆటోలు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేశాయి. మొత్తం 18 వేలకు పైగా ప్రజలు శనివారం తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.

అధికారుల పర్యవేక్షణ
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీస్‌ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా బస్సు డిపోలు పర్యవేక్షించారు. అంతే కాకుండా రద్దీ ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలు తలెత్తకుండా బస్సులు నడిపించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట్లకు వాహనాలను పంపించి ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరుకునేలా సహకరించారు. మరోవైపు పోలీసులు అధిక చార్జీల వసూళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో బస్సులను తనిఖీ చేసి ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు.

పేట డిపోను పరిశీలించిన ఆర్డీవో
నారాయణపేట రూరల్‌ : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను శనివారం పేట ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న ఏయే రూట్లలో బస్సులు వెళ్లాయి, ఎన్ని తిరుగుతున్నాయనే వివరాలను ఇన్‌చార్జి డీఎం మురళీధర్‌రెడ్డి, డీటీ ప్రమీలను అడిగి తెలుసుకున్నా రు. కాగా డిపో నుంచి 48 ప్రభుత్వ బస్సు లు, 24 ప్రైవేట్‌ బస్సులను వివిధ రూట్లకు పం పించడం జరిగిందని వారు ఆర్డీవోకు వివరించారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles