కార్మికుల ఆవేదనపై ప్రభుత్వం స్పందించాలి

Sun,October 13, 2019 02:12 AM

- బీజేపీ నేతలతో కలిసి అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : కార్మికుల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు జీఎల్‌.గౌడ్‌, డీఎస్‌. చారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రోడ్ల భవనాల శాఖ అతిథి గృహం నుంచి బస్టాండ్‌ వరకు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. అనంతరం బీజేపీ నేతలతో కలిసి బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఇబ్బందులను గుర్తించి బేజేపీతో పాటు ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు అన్నియూ మద్దతు తెలుపడం సంతోషంగా ఉందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెలోనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం బస్టాండ్‌లో వాంటావార్పు నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎర్రశేఖర్‌, పాండు రంగారెడ్డి, బీజేపీ, ఆర్టీసీ నేతలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles