చేపల పెంపకంతో.. మత్స్యకారులకు జీవనోపాధి

Sat,October 12, 2019 01:58 AM

మక్తల్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుండడంతో వారికి జీవనోపాధి ఏర్పడిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మక్తల్ మండలం సంగంబండలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే చిట్టెం దాదాపు తొమ్మిది లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో గత ఏడాది 80 లక్షల చేపపిల్లలను విడుదల చేసి పెంచామన్నారు. ఈ ఏడాది దాదాపు కోటి 20లక్షలకు పైగా చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఉపయోగం కలిగే విధంగా చేపల మార్కెట్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పీ నర్సింహగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles