ప్లాస్టిక్హ్రిత పాఠశాలలుగా మారుద్దాం

Sat,September 14, 2019 03:43 AM

మరికల్: పేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ప్లాస్టిక్హ్రిత పాఠశాలలుగా మారుద్దామని పేట డీఈవో రవీందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయం దాటి వచ్చిన విద్యార్థులను ప్రశ్నించారు. ఈ సందర్భాంగా విద్యార్థుతులు మాట్లాడుతూ సమయానికి బస్సులు లేక అలస్యమైందని తెలిపారు. బస్సుల విషయమై డీఎంతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. యూనిఫాం లేకుండా పాఠశాలకు వస్తే ఏలా అని విద్యార్థులను మందలించారు. అనంతరం ఆయాన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ వాడకం నిషేదిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హెచ్‌ఎం మధూసుదన్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

8
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles