పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని రైతు నిరసన

Sat,September 14, 2019 03:35 AM

అయిజ : తన భూమికి చెందిన పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని అయిజ పట్టణానికి చెందిన ఓ రైతు మందు డబ్బా చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పట్టణంలోని తహసీల్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. తాసిల్దార్ కిషన్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు రమేశ్‌కు ప్రభుత్వం గతంలో భూమిని మంజూరు చేసింది. మంజూరు చేసినప్పటి నుంచి రైతు భూకబ్జాలో లేకపోవడంతో ఆ భూమి పట్టాను రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్నారు. ఈ విషయమై రైతుకు నోటీసు సైతం అందజేశామన్నారు. రద్దు చేసిన నోటీసును తీసుకుని గత సోమవారం కలెక్టర్ శశాంకను కలిసినట్లు రైతు తెలిపాడన్నారు. రైతు తన భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరడంతో తాసిల్దార్ తన చేతుల్లో ఏమీ లేదని అతనిని బయటకు పంపానన్నారు. రైతు మందు డబ్బా తీసుకువచ్చి నిరసనకు దిగడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు రంగప్రవేశం చేసి రైతుకు నచ్చచెప్పడంతో నిరసన విరమించుకుని వెళ్లిపోయాడని తాసిల్దార్ పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ తెలిపారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles