రేపు సీనియర్ పురుషుల హాకీ పోటీల సెలక్షన్స్

Sat,September 14, 2019 03:35 AM

వనపర్తి క్రీడలు : ఈ నెల 15వ తేదీన స్థానిక బాలకిష్టయ్య క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా హాకీ సీనియర్ పురుషుల విభాగంలో ఎంపి కలను నిర్వహించనున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గోటూరు శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీలలో సింగిరెడ్డి రామ్‌రెడ్డి మెమోరియల్ పేరు మీదుగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ పోటీలలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎంపికలలో ఆసక్తి కలిగి ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు పాల్గొనాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

8
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles