శోభాయమానంగా రథోత్సవం

Sat,September 14, 2019 03:34 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : భారత దేశంలో గల అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా విరాజి ల్లుతున్న పట్టణంలోని జోగుళాంబ ఆలయంలో ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో అమ్మ వారి రథోత్సవం నిర్వహిస్తారు. సంధ్యా వేళ రథోత్సవం కంటే ముందు ఉదయం యాగశాలలో చండీహోమం నిర్వహించారు. జోగుళాంబ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక రోజును పురస్కరించుకొని అమ్మ వారికి అర్చకులు వారోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి బంగారు అభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు మొదలగు పూజలు నిర్వహించారు.

సంధ్యావేల మహా మంగళహారతి పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అంద జేశారు. ఉదయం నిర్వహించిన చండీ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయాన జోగు ళాంబ ఆలయంలో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శుక్రవారం ప్రత్యేక రోజును పురస్కరించుకుని భక్త యాత్రికుల అధిక సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. భక్తులు వారి శక్తి కొలది కానుకలు ఆలయానికి సమర్పించుకున్నారు.

12
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles