వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

Sat,September 14, 2019 03:34 AM

బల్మూరు : విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి వరప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని బాణాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మలేరియపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం బల్మూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మలేరియాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై వివరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు వినయ్‌కుమార్, నిరంజన్, చారి, మల్లేశ్, గంగ్యా, పద్మ, తిరుతపమ్మ, హెచ్‌ఎం తిరుపతయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles