నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Thu,August 15, 2019 03:12 AM

మక్తల్ రూరల్ : గ్రామాల అభివృద్ధిలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని, ప్రతి ఒక్క అధికారి తమకు కేటాయించిన విధుల పట్ల అంకితభావంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో బుధవారం మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ మండలాల్లో హరితహారం, ఎస్‌బీఎం, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ 40వేల మొక్కలను నాటేందుకు నిర్ణయించామన్నారు. కానీ వర్షాలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా లక్ష్యం దిశగా ముందుకు సాగడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లలతో ఎంపిడీవో, ఏపీవోలు చర్చించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్లు లేని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.12వేలను అందిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం కారణంగా పనులు చురుగ్గా సాగడం లేదన్నారు. అలాగే గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను సైతం వేగవంతం చేయాలన్నారు. డంపింగ్ యార్డులను చెరువులు, కుంటల సమీపంలో కాకుండా మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో రఘువీరారెడ్డి, జెడ్పీ సీఈవో కాళిందిని, డీపీవో మురళి, ప్రత్యేకాధికారి విజయానంద్, మక్తల్ ఎంపీడీవో పావనితో పాటు నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఏపీవోలు, ఏపీఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

వరద బాధితులకు సామగ్రి పంపిణీ
ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరదలతో నిరాశ్రయులుగా మారిన వారికి కృష్ణ మండలంలోని కున్సీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వినియోగించేందుకు గానూ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సమకూర్చిన సామగ్రిని కలెక్టర్ చేతుల మీదుగా పునరావాస కేంద్రానికి అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ అధ్యక్షుడు నటరాజ్‌తో పాటు సభ్యులు, మక్తల్ లయన్స్‌క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles