ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

Thu,July 11, 2019 03:50 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కోర్టు కేసులు లేని 374 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్‌టీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చర్యల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఎంపికైన వారి సర్టిఫికెట్లను గురువారం పరిశీలించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. టీఆర్‌టీ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువ పత్రాలతోపాటు రెండు సెట్ల అటెస్టెడ్ కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 13,14 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించి అదే రోజు నియామక ఉత్తర్వులను అందజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు 15న విధుల్లో చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.

డీఈవో కార్యాలయం వద్ద అభ్యర్థుల సందడి
టీఆర్‌టీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారన్న విషయం తెలుసుకున్న పలువురు డీఈవో కార్యాలయానికి చేరుకొని సందడి చేశారు. తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదా అని ఆరా తీశారు. జాబితాలో తమ పేర్లు చూసుకొని సంబుర పడ్డారు. పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించనున్న సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..
స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల బయో సైన్స్ ప్లేన్ ఏరియా 4, జెడ్పీ ప్లేన్ ఏరియా 35, ప్రభుత్వ ఉర్దూ మీడియం బయో సైన్స్ 2, ఇంగ్లిష్ ప్లేన్ ఏరియా 2, గణితం ప్లేన్ ఏరియా 35, ఏజెన్సీ ఏరియా 1, ఫిజికల్ సైన్స్ ఏజెన్సీ ఏరియా 1, ప్లేన్ ఏరియా 5, ఫిజికల్ సైన్స్ ఎల్‌బీ ప్లేన్ ఏరియా 15, ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 1, ఏజెన్సీ 1, సోషల్ ప్రభుత్వ పాఠశాల ఏజెన్సీ ఏరియా 1, ఉర్దూ మీడియం ప్లేన్ ఏరియా 1, సోషల్ ప్రభుత్వ పాఠశాల ప్లేన్ ఏరియా 5, ఏజెన్సీ ఏరియా 4, సోషల్ జెడ్పీ ప్లేన్ ఏరియా 128, తెలుగు ప్రభుత్వ పాఠశాలలు ప్లేన్ ఏరియా 4, ఏజెన్సీ 1, తెలుగు జెడ్పీ పాఠశాలలు 39, ఉర్దూ ప్రభుత్వ పాఠశాల 1, జెడ్పీ ఉర్దూ ప్లేన్ ఏరియా 1, ఇంగ్లిష్ జెడ్పీ ప్లేన్ ఏరియా 14, ఏజెన్సీ ఏరియా 1 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు. లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ జెడ్పీ ప్లేన్ ఏరియా 2, ప్రభుత్వ పాఠశాలలు 2, భాషా పండితులు జెడ్పీ ప్లేన్ ఏరియా 55, ప్రభుత్వ ప్లేన్ ఏరియా 9, ఏజెన్సీ ఏరియా 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles