-బడీడుపిల్లలంతా బడిలోనే ఉండాలి
-డీఈఓ భిక్షపతి
-బడి బయటి పిల్లల సర్వేపై డైట్లో శిక్షణ
-ధరణి పెండింగ్ ఖాతాలను పరిష్కరించాలి : కలెక్టర్
నల్లగొండ, నమస్తే తెలంగాణ: ధరణి పెండింగ్ ఖాతాలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ చంద్రశేఖర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం మిర్యాలగూడ, పెద్దవూర, మధ్యాహ్నం అనుముల, త్రిపురారం, మాడ్గులపల్లి మండలాల తహసీల్దార్లు, వీఆర్వోలు, ఆర్ఐలతో గ్రామాల వారిగా పెండింగ్ ఖాతాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ ఖాతాల్లో పరిష్కరించేవి డిజిటల్ సంతకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఖాతాను రికార్డు చేయాలని అధికారులకు సూచించారు. పరిష్కారం లేని ఖాతాలకు ఎండార్స్మెంట్ వేసి కారణాలు పేర్కొంటూ ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఆర్డీవో జగన్నాథరావు, కలెక్టరేట్ ఏవో మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.