బడి బయటి పిల్లల గుర్తింపునకు ‘సన్నద్ధం’


Thu,December 5, 2019 01:29 AM

-నేటి నుంచి 13వరకు జిల్లావ్యాప్తంగా సర్వే
-ఎంఈఓ, డీఎంఎల్‌టీలకు పూర్తయిన శిక్షణ
-6-14ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యఅందించేలా సర్కారు చర్యలు

నల్లగొండ విద్యావిభాగం : అందరకీ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. బడికి వెళ్లని బడీడు పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పే ఉద్దేశంతో జిల్లాలో ఎంఈఓ, డీఎల్‌ఎంటీలు, సీఆర్‌సీపీలు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లకు సర్వే విధానంపై శిక్షణ ఇచ్చింది. ఎనిమిది రోజులపాటు ‘బడిబయటి ఉన్న పిల్లల వివరాలు-2019 గుర్తించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే దిశగా జిల్లా విద్యాశాఖాధికారులు ముందుకుసాగుతున్నారు.
పక్కాగా గుర్తించేలా అవగాహన, శిక్షణ..

అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో బడి బయటి పిల్లలను గుర్తించేందుకే జిల్లా వ్యాప్తంగా 31 మండలాల ఎంఈఓలు, క్లాంప్లెక్స్‌ హెచ్‌ఎం, సీఆర్‌స్పీలు, ఎంఐఎస్‌-కో-ఆర్డినేటర్లకు అవగాహన -శిక్షణను జిల్లా విద్యాశాఖ పూర్తి చేసింది. అంతే కాకుండా సర్వే ఎలా నిర్వహించాలి.? ఏ వివరాలు సేకరించాలనే అంశంపై సలహాలు, సూచనలు ఇచ్చారు.

సర్వే ఇలా...
- ఈనెల 5నుంచి 13వరకు ( ఎనిమిది పనిదినాలు)లో గ్రామస్థాయి/హాబిటేషన్‌ పరిధిలో సీఆర్‌ప్సీ, డీఎంఎల్‌టీలు ఆయా ప్రాంతంలోని బడి బయటి పిల్లలను గుర్తించాలి. అదేవిధంగా సీడబ్ల్యూఎస్‌ఎన్‌(చిల్డ్రన్స్‌ విత్‌ స్పెషల్‌ నీడ్స్‌) వివరాలను ఐఈఆర్‌టీలను సేకరించాలి.
- ఈనెల 14నుంచి 19వరకు బడి బయటి పిల్లలకు సంబంధించి సేకరించిన వివరాలను మండలావారిగా సీఆర్‌స్పీలు , ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు మండల స్థాయిలో నమోదు చేయాలి
- ఈనెల 21లోగా మండలస్థాయిలో నమోదు చేసిన సమాచారాన్ని డీపీఓ (జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌)కు పంపించాలి.
- 27న మండలాల నుంచి జిల్లా విద్యాశాఖకు చేరిన సమాచారాన్ని పరిశీలించాలి.
- 28న జిల్లా స్థాయికి చేరిన బడిబయటి పిల్లల సర్వే సమాచారాన్ని రాష్ట్ర ప్రాజెక్టు అధికారికి జిల్లా విద్యాశాఖ నుంచి పంపించాలి.

28 అంశాలతో సీఆర్‌స్పీలు సర్వేకు....
బడిబయటి పిల్లల సర్వేకు సంబంధించి శిక్షణలో అందజేసిన 28 సమాచారంతో కూడిన ప్రొఫార్మాలతో సీఆర్‌స్పీలు క్లాంప్లెక్స్‌ వారిగా ఈ నెల 5నుంచి ఎనిమిది పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రొఫార్మాలలోని అంశాలపై అవగాహన పెంచుకుని సీఆర్‌ప్పీలు వారి కాంప్లెక్స్‌ పరిధిలోని అన్ని పాఠశాలల పరిధిలో సర్వేను పూర్తి చేయాల్సి ఉంది. విద్యార్థ్ధి బడికి వస్తూ మానివేస్తే ఆ విద్యార్థి అంశాలను 28 అంశాల్లో నమో దు చేయాలి. ఈ సేకరించిన సమాచారాన్ని చైల్డ్‌ఇన్ఫోలో పొందుపర్చాలి.

సర్వేలో పరిశీలించేవి ఇవే...
జిల్లా వ్యాప్తంగా ప్రతి ఫ్రభు త్వ పాఠశాలలో 1నుంచి 10వ తరగతిలోపు బడీడు పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తిస్తే వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అదే విధంగా పాఠశాలలల్లో సీఆర్‌పీలు గత రెండ సం.లకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించి నెలరోజులకుపైగా పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు సేకరించాల్సి. వాటిని ఆన్‌లైన్‌ల్లో నమోదు చేయాలి. అంతకాకుండా విద్యార్ధి ఆధార్‌, ఈఐడీ నెంబర్‌ లేకపోతే వివరాలను ఎక్సెల్‌ ఫార్మట్‌లో మండల రిసోర్స్‌ సెంటర్‌(ఎంఆర్‌స్సీ)లో అందచేయాల్సి ఉంటుంది. సర్వేలో తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాల్సి...ఒకే వేళా తప్పుడు సమాచారం సేకరిస్తే సంబందిత బాద్యులపై చర్యలు తీసుకోనున్నారు. సీఆర్‌పీలు చేసే సర్వేను ఆ కాంపెక్స్‌(క్లస్టర్‌) ఫ్రధానోపాధ్యాయులతోపాటు ఎంఈవోలు సమన్వకర్తలుగా వ్యహరించాలి.

అందరి సహాకారంలో...
సర్వేకు సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతోపాటు, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌, సభ్యులు, సర్పంచులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళాలు, గ్రామస్తులతో బడిబయటి పిల్లల వివరాలు సేకరించి ఖచ్చిత సమాచారం నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. వీరందరి సహకారంతో సర్వేను పక్కా నిర్వహించే దిశగా అధికారులు సమయత్తమవుతున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...