రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్వేయం


Wed,December 4, 2019 12:47 AM

-ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
హాలియా, నమస్తే తెలంగాణ(గుపూరంపోడ్) : రైతు శ్రేయస్సే ధ్వేయంగా టీఆర్‌ఎస్ పభుత్వ పని చేస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మంగళవారం గుర్రంపోడ్, పెద్దవూర మండల కేంద్రాల్లో జరిగిన కార్యక్షికమాల్లో రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 2విడత పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్షికమం ద్వారా ప్రతి రైతు భూమిని సర్వే చేసి వాస్తవంగా భూమి ఉన్న రైతుకే కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేస్తుందన్నారు. నూతన డిజిటల్ పాసు పుస్తకాలతో గతంలో మాదిరిగా నకిలీ పాసు పుస్తకాలను సృష్టించే అవకాశం లేదన్నారు. ధరణీ వెబ్‌సైట్ సహాయంతో తాసీల్దార్లే సమస్యను పరిష్కరించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు.

గుర్రంపోడ్‌లో ఎంపీపీ మంచికంటి వెంక జడ్పీటీసీ గాలి సరిత రవికుమార్, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ, ఎంపీడీఓ అబ్ధుల్లా షరీఫ్, డీటీ జివెద్, ఆర్‌ఐ సుదర్శన్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నాడ్డి ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ బల్గూరి నగేష్‌గౌడ్, సర్పంచ్ షేక్ మసరత్ జహా సయ్యద్‌మియా, నాయకులు పాశం గోపాల్‌డ్డి, పోలేని ముత్యాలు, గుండెబోయిన కిరణ్, వెలుగు రవి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. పెద్దవూరలో ఎంపీపీ చెన్ను అనురాధ, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణాడ్డి, తాసీల్దార్ సైదులుగౌడ్, ఎంపీటీసీ కృష్ణరావు, గజ్జెల లింగాడ్డి, షేక్ బషీర్, కర్ణ బ్రహ్మనందడ్డి, ఆడెపు రామలింగయ్య, సుందర్‌డ్డి, రవినాయక్, కురాకుల అంతయ్య, సర్పంచ్‌లు వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...