యాదాద్రిలో ఆంజనేయుడికి ఆకుపూజ


Wed,December 4, 2019 12:45 AM

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని విష్ణు పుష్కరిణి వద్ద గల ఆంజేయస్వామి ఆలయంలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకం చేసి తమలపాకులతో అర్చన జరిపారు. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీ లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం చేశారు.


తొలుత సుదర్శన నారసింహహోమం నిర్వహించి మహా మండపంలో అష్టోత్తరం గావించారు. సాయంత్రం అలంకార సేవను సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం లలిత పారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు పూజలు కొనసాగాయి.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...